UPDATED 12th MARCH 2022 SATURDAY 02:55 PM
Karnool Excavations For Hidden Treasures : కర్నూలు జిల్లా పత్తికొండలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. జిల్లాలోని పత్తికొండ మండలంలో శ్రీకృష్ణ దేవరాయలు నాటి రాజులమండగిరి గ్రామ సమీపంలో గుప్తనిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు జరిపారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. రాజులమండగిరి గ్రామ సమీపంలో రాజులమండగిరిలో బుగలఅమ్మ గ్రామ దేవత విగ్రహాన్ని పెకిలించి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు.
గుప్త నిధుల కోసం పురాతన దేవాలయాను టార్గెట్ గా చేసుకున్న దురాశాపరులు ఈ తవ్వకాలకు పాల్పడుతున్నారు. పురాతన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. పురాతన ఆనవాళ్లు కనుమరుగు చేస్తున్నారు. అర్ధరాత్రి గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఆగడాలతో పురాతన ఆనవాళ్లు కనుమరుగు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుప్తనిధుల తవ్వకాలు ఎవరు జరిపారు? వారు ఎవరు? ఎక్కడనుంచి వచ్చారు?ఈ ముఠా వెనుక ఎవరన్నా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ గుప్త నిధుల తవ్వకాల విషయంపై మండలంలో పెద్ద చర్చనీయాంశమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.