జై సింహా .. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

UPDATED 1st NOVEMBER 2017 WEDNESDAY 7:30 PM

నందమూరి బాలకృష్ణ, కె ఎస్ రవికుమార్ కాంబినేష‌న్‌లో జై సింహ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య 102వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్‌ యాభై శాతం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఫస్ట్ లుక్ తో పాటు మోష‌న్ పోస్టర్ ని విడుదల చేసారు. దాన వీర శూర‌క‌ర్ణ‌ న‌ర‌సింహుడు వ‌చ్చాడు అంటూ మోష‌న్ పోస్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంటుంది. బాల‌య్య లుక్ మాత్రం ఈ చిత్రంలో అదిరింద‌ని అంటున్నారు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం పోషిస్తుండగా, ఆయన సరసన నయనతార, హరిప్రియ, నఠాషా దోషిలు కథానాయికలుగా నటిస్తున్నారు. సింహా సెంటిమెంట్‌ బాల‌య్య‌కి క‌లిసొస్తుండ‌డంతో ఈ మూవీకి కూడా సింహ‌ అనే ప‌దాన్ని త‌గిలించి జై సింహా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫ‌స్ట్ లుక్‌లో బాల‌య్య క‌ర్ర ప‌ట్టి వీరావేశంతో క‌నిపిస్తుండ‌గా, పోస్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్‌లో ఎన్టీఆర్ విగ్ర‌హం క‌నిపిస్తుంది. విగ్ర‌హం ముందు కొంద‌రు ధ‌ర్నా చేస్తున్న‌ట్టు కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. చిరంతన్‌ భట్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. స‌మ‌రసింహా రెడ్డి స్టైల్ లోనే ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అశుతోష్ రాణాలు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us