Young Heroes: కుర్రాళ్ళ యాక్షన్.. డిజాస్టరవుతున్న సినిమాలు!

UPDATED 3rd MARCH 2022 THURSDAY 08:00 PM

Young Heroes: సినిమాల్లోకి వచ్చాక ఒక జానర్ కి ఫిక్స్ అయిపోయారనే ఇమేజ్ తెచ్చుకోకుండా ఉండడానికి అన్నిరకాల క్యారెక్టర్లు చేస్తుంటారు. లవ్, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్ లాంటి అన్ని రకాల జానర్స్ ట్రై చేస్తున్నారు. కానీ కొంతమంది హీరోలు యాక్షన్ చేస్తే మాత్రం చూడలేపోతున్నారు జనాలు. ఈ హీరోలు యాక్షన్ సినిమాలు వస్తుంటే చాలు ప్రేక్షకులు మాకొద్దు బాబోయ్ అంటూ దూరం జరిగిపోతున్నారు. మరి యాక్షన్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యలేకపోతున్న హీరోలెవరో చూద్దాం.మిగతా హీరోలు ఏం చేసినా చూస్తున్నారు కానీ.. ఈ హీరోలు యాక్షన్ చేస్తే మాత్రం చూడలేమంటున్నారు ఆడియన్స్.

రొమాన్స్, లవ్ బోర్ కొట్టేసిందని యాక్షన్ లోకి దిగినఈ హీరోలు సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాని.. ఇప్పటి వరకూ బాయ్ నెక్ట్స్ డోర్ సినిమాలు చేసి ఆడియన్స్ కి దగ్గరైన నాని.. వి, టక్ జగదీష్ సినిమాల్లో యాక్షన్ చేసి చూపించారు. మిగతా ఎమోషన్స్ ఉన్నా కూడా యాక్షన్ కంటెంటే ఎక్కువ చేశారు నాని. కానీ ఈ రెండు సినిమాల రిజల్ట్ నానీకి మైలేజ్ ఇవ్వలేకపోయాయి.

శర్వానంద్ కూడా కెరీర్ లో రకరకాల జానర్స్ ట్రై చేశారు. వీటన్నింటిలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు మాత్రం పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. శర్వా రణరంగం, మహాసముద్రం లాంటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. కానీ పడిపడి లేచెమనసు, మహానుభావుడు, శతమానంభవతి లాంటి ఫ్యామిలీ, రొమాంటిక్ సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేసిన అక్కినేని హీరో అఖిల్ కి కూడా పెద్దగా యాక్షన్ కలిసిరాలేదు.

అఖిల్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ యాక్షన్ తో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రూట్ మార్చి హలో, మిస్టర్ మజ్ను లాంటి డిఫరెంట్ మూవీస్ చేసినా వర్కవుట్ కాలేదు. కానీ రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం అదిరిపోయే హిట్ కొట్టింది.మరో యంగ్ హీరో నాగశౌర్య యాక్షన్ సినిమాలు చేస్తే అంతగా ఆదరించడం లేదు ఆడియన్స్. అశ్వద్దామ, లక్ష్య లాంటి సినిమాలు అనుకున్నంత హిట్ కొట్టలేకపోయాయి.

అయితే ఓ బేబీ, వరుడు కావలెను లాంటి క్యూట్ లవ్ స్టోరీలు ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇలా ఈ హీరోలు యాక్షన్ చేస్తే మాత్రం జనాలకు నచ్చడం లేదు.. అందుకే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us