KCR:బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారు : కేటీఆర్

UPDATED 16th FEBRUARY 2022 WEDNESDAY 04:00 PM

హైదరాబాద్: తెలంగాణలో గులాబీ వర్సెస్ కాషాయం అన్నట్లుగా జగడాలు కొనసాగుతున్నాయి.టీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు ప్రతివిమర్శలతో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈక్రమంలో మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈక్రమంలో బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓట్లు వేసి గెలిపించి అధికారం కట్టబెట్టిన ప్రజలకు బీజేపీ ఏం చేసిందో చెప్పటానికి ఏమీ లేదని..డబ్బాలో రాళ్లేసి ఊపినట్లే బీజేపీ పాలన ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.తెలంగాణకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందో చెప్పే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవని దుయ్యబట్టారు.

దళితులకు సంవత్సరానికి రూ.300లు ఇచ్చి పేద్ద ఏదో ఇచ్చేసినట్లే బీజేపీ గప్పాలు కొడుతోందని రూ.300లతో పండగ చేసుకోవాలంటోందని అదే తెలంగాణలో రైతులకు,దళితులకు ఇచ్చేదానితోపోలిస్తే కేంద్రం ఇచ్చేంది ఎంత?అని ప్రశ్నించారు. తెలంగాణ వృద్ది రేటులో ఎలా ఉందో కాస్త తెలుసుకోవాలని బీజేపీకి సూచించారు కేటీఆర్. దళితులపైనా, రైతులపైనా బీజేపీ ప్రభుత్వానాకి ఎటువంటి ప్రేమ లేదని రైతు బంధును ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రైతుల కష్టాన్ని కొనలేక చేతులెత్తేసిన బీజేపీ ప్రభుత్వమా మమ్మల్ని విమర్శించేది అంటూ మండిపడ్డారు కేటీఆర్.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us