Vedurupaka God : నేటి నుంచి గాడ్‌ జన్మదిన వేడుకలు

★ ఈనెల 17 నుంచి 20 వరకు నాలుగురోజులపాటు నిర్వహణ

రాయవరం (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022: వెదురుపాక విజయదుర్గా పీఠంలో పీఠాధిపతి గాడ్‌ 86వ జన్మదిన వేడుకలు ఈనెల17 నుంచి 20 వరకు నాలుగురోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు పీఠం అడ్మినిస్ట్రేటర్‌ వీవీ బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు బాబి తెలిపారు. స్థానిక విలేకరులతో ఆదివారం వారు మాట్లాడుతూ 17న ఉదయం 9.30 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అన్నారు. 17న భద్రాచలం వేద పండితులతో సీతారాముల కల్యాణం, సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తామని అన్నారు. సాయంత్రం 6 గంటలకు తమిళనాడు తిరుత్తణి అర్చకులతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం జరుగుతుందన్నారు. 18న తిరుమల తిరుపతి వేదపండితులతో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం, సాయంత్రం 6 గంటలకు విజయదుర్గా అమ్మవారికి 108 హారతులు నిర్వహిస్తామన్నారు. 19న గాడ్‌ జన్మదినం పురస్కరించుకుని ఉదయం 5 గంటలకు భక్తుల ఆధ్వర్యంలో ఆయనకు పాద పూజలు జరుగుతాయని, అనంతరం జన్మదిన వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. 20న కాశీ పండితులతో విశ్వేశ్వరస్వామి, అన్నపూర్ణ అమ్మవారికి అర్చనలు, హారతులు నిర్వహిస్తామని, కార్యక్రమంలో పీఠం ప్రతినిధి గాదే భాస్కరనారాయణ పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us