AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు గెజిట్!

UPDATED 30 MARCH 2022 WEDNESDAY 07:00 AM

AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఇవాళే కొత్త జిల్లాలకు సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 26 జిల్లాలు, 15 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ రెండో తేదీ ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచే పాలన చేపట్టాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

విపక్షాల విమర్శలు.. అభ్యంతరాలు సంగతి ఎలా ఉన్నా.. సీఎం జగన్ ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఉగాది నాటికి ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేస్తున్నారు. కొత్త జిల్లాల్లో కలిపిన ప్రాంతాలకు సంబంధించి, జిల్లాలకు పెట్టిన పేర్లపై.. పలు విన్నపాలతో పాటు అభ్యంతరాలు వచ్చాయి. వీటిన్నంటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. చిన్న చిన్న మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

కొత్త జిల్లాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపట్టింది. వినతులు, అభ్యంతరాల్లో స్వల్ప మార్పులు మినహా పెద్దగా మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన జిల్లా కేంద్రాల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది.

డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో చెప్పిన 11 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త జిల్లాల వారీగా కేడర్ అలాట్మెంట్ పూర్తయింది. కొత్త కలెక్టరేట్లల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల యంత్రాంగం ఫోకస్ పెట్టింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us