Updated 26 January 2022 Wednesday 19:00 PM
తిరుమల (రెడ్ బీ న్యూస్): ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు, 29న ఉదయం 9 గంటలకు టైం స్లాట్ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను పొందవచ్చని టీటీడీ తెలిపింది.