గ్రామాల్లో అన్నక్యాంటీన్లు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి

UPDATED 3rd DECEMBER 2018 MONDAY 6:00 PM

పెద్దాపురం: గ్రామాల్లో అన్నక్యాంటీన్లు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మండల పరిధిలోని చంద్రమాంపల్లి, దివిలి గ్రామాల్లో షాపింగు కాంప్లెక్స్, రూ.23.52 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైన్లను సోమవారం ఆయన  ప్రారంభించారు. అనంతరం గ్రామదర్శిని- గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా చంద్రమాంపల్లి గ్రామంలో  మంత్రి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పెద్దాపురం మండలం దివిలి, సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామాల్లో అన్నక్యాంటిన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దాపురం పట్టణంలో అన్నక్యాంటిన్ ప్రారంభమైందని, ఈ నెలలో సామర్లకోట పట్టణంలో కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల్లో పేద ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడం జరిగిందని తెలిపారు. చంద్రమాంపల్లి గ్రామంలో రూ.40 లక్షలతో కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మొదటి విడతగా రూ.20 లక్షలతో మండప నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందని, అలాగే గ్రామంలో రూ.ఐదు లక్షలతో బిసి కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేశామన్నారు. దివిలి సెంటరులో ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని, అలాగే గ్రామాల్లో మౌలిక వసతులు నూరుశాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. చంద్రన్నభీమా, వృద్ధాప్య పింఛన్లు, ఉచిత వైద్య సేవలు, చంద్రన్న పెళ్లికానుక, ఒంటరి మహిళలకు పింఛన్లు, ఉచిత విద్య, తదితర అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలుచేస్తుందని తెలిపారు. అనంతరం దివిలి గ్రామంలో మొక్కలు నాటి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. అలాగే గ్రామంలో గల శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి వారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్తీక వన సమారాధనలో పాల్గొని సహపంక్తి భోజనం చేశారు. అలాగే  పెద్దాపురం పట్టణంలో నిర్మించిన జట్టు వర్కర్ల  యూనియన్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), గుడా డైరెక్టర్ ఎలిశెట్టినాని, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కంటిబోయిన వెంకటేశ్వరరావు, కంటిబోయిన చంటిబాబు, కమ్మిల సుబ్బారావు, పడాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us