పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం

UPDATED 9th JULY 2018 MONDAY 6:30 PM

పెద్దాపురం: రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించేందుకు 100 అన్న కేంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పెద్దాపురం పట్టణంలో రూ. 36 లక్షలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక భాస్కర్ కాలనీలో రూ. 25 లక్షలతో నిర్మించ తలపెట్టిన వి.సి కళ్యాణ మండపం, రూ. 30 లక్షలతో మున్సిపల్ సెంటర్లో అన్నకేంటిన్ భవనానికి శంకుస్థాపనలు,16వ వార్డులో రూ.5 లక్షలతో పునర్ నిర్మించిన దర్గాను ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ త్వరలో అన్నకాంటీన్లు సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్నకేంటీన్ ద్వారా రూ. ఐదుకే పేదలకు నాణ్యమైన భోజనం అందచేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే  పట్టణంలో సిసి రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తున్నామని, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఎఎంసి చైర్మన్ ముత్యాల రాజబ్పాయి. మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, వార్డు కౌన్సిలర్లు యర్రా లక్ష్మి, సయ్యద్ దేవీఅమీనా, బేదంపూడి సత్తిబాబు, తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతికరాజు, తదితరులు పాల్గొన్నారు.
 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us