UPDATED 22nd MARCH 2022 TUESDAY 08:45 PM
TTD : శ్రీవారి భక్తులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కరెంటు బుకింగ్‌లో ఆర్జిత సేవలను టీటీడీ కేటాయించనున్నది. సీఆర్వో కార్యాలయం వద్ద గల కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లను కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. టిక్కెట్ల కోసం భక్తులు ముందురోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదు చేసుకొనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. సాయంత్రం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్లను భక్తులకు టీటీడీ కేటాయించనున్నది.