ఆదిత్యలో ఉత్సాహంగా ఇంటర్ కాలేజెస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్

UPDATED 3rd MARCH 2018 SATURDAY 5:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో జె.ఎన్.టి.యు.కె మహిళల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలు, పురుషుల, మహిళల అథ్లెటిక్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు చెందిన 56 కళాశాలల నుంచి 1600 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్ కు  ఆదిత్య యాజమాన్యం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలతో ఉజ్వల భవిష్యత్తుతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, బి.పి.డి. కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శరభోజీ, మీట్ ఆర్గనైజెషన్ సెక్రటరీ సి.హెచ్.మురళీమోహన్, వివిధ కళాశాలల వ్యాయమ అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.    

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us