కట్టమూరులో భగవద్గీత పోటీలు

UPDATED 8th JULY 2018 SUNDAY 8:00 PM

పెద్దాపురం: భగవద్గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలోని శ్రీ కేశవ, పట్టాభిరామస్వామి వారి దేవాలయంలో ఆదివారం భగవద్గీత పోటీలు నిర్వహించారు. సమితి వ్యవస్థాపకుడు మల్లిఖార్జున స్వామి పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు. సీనియర్స్ విభాగంలో మట్టే సాయిహన్సీ (పెద్దాపురం), పచ్చిపాల భువనేశ్వరి (గోరింట), కలకోట భానుశ్రీ (సామర్లకోట), జూనియర్స్ విభాగంలో వినయ్ కుమార్ (కట్టమూరు), ఎం. షణ్ముకి (ఆర్.బి.కొత్తూరు), వెంకట ప్రసన్న(గోరింట) విజేతలుగా నిలిచారు. విజేతలకు ఆలయ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ పచ్చిపాల ప్రసాదరావు (గోరింట ప్రసాద్), కన్వీనర్ సత్యకుమార్, కృష్ణదేవ మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us