గైట్ విద్యార్థుల వినూత్న సృష్టి దివ్య రథ్

UPDATED 15th MARCH 2018 THURSDAY 9:30 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల విద్యార్థులు బహువిధాలుగా ఉపయోగపడే ఒక వినూత్న వాహనాన్ని రూపొందించారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎం. తిరుపతిరెడ్డి, పి. సురేందర్ రెడ్డి, బి. బాలకృష్ణ సింగ్, వై.వి.ఎస్.పి. రఘునాధ్, సి.హెచ్.నాగ ఫణింద్రరెడ్డి తమ అకడమిక్ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్  విభాగాధిపతి, గైడ్ వి. సుబ్రహ్మణ్యం సూచనల మేరకు ఇరుకు రోడ్లలో ప్రయాణించేలా, అంబులెన్స్ గా ఉపయోగపడేలా, దివ్యాంగులకు ఉపకరించేలా ఈ వాహనాన్ని రూపొందించారు. పాతకాలంలో మిలటరీలో సైడ్ కార్ విధానాన్ని చూసి ప్రభావితమై, దానికి టాప్, లగేజ్ పెట్టుకునే ప్రదేశం, పుష్ బ్యాక్ సీట్ లో ఒక చక్రం అమర్చి తేలికపాటి పదార్ధాలతో దీన్ని తయారుచేశారు. రివర్స్ గేర్ తో కూడిన బైక్ ఇంజిన్ ను అమర్చి చిన్నపాటి బోల్టులతో తేలికగా బిగించగలిగేలా దీన్ని తీర్చిదిద్ది, ఈ వాహనానికి దివ్యరథ్ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామ్మూర్తి మాట్లాడుతూ ఒక లీటరు పెట్రోలుతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో, గంటకు 40  కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుందని, దీని తయారీకి రూ. 35 వేలు ఖర్చుఅయిందన్నారు. దీనిని మరింత అభివృద్ధి చేసి త్వరలో ఉత్పత్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు వారు తెలిపారు.         

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us