నాటు తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతాం

UPDATED 5th MARCH 2018 MONDAY 8:00 PM

పెద్దాపురం: జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రోహిబిషన్ అండ్ ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ కె. హేమంత నాగరాజ్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక ప్రొహిబిషన్ కార్యాలయంలో విలేకరులతో సోమవారం మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా నవోదయం కార్యక్రమంలో భాగంగా సారా తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న19 ప్రోహిబిషన్ అండ్ ఎక్సయిజ్ స్టేషన్ల పరిధిలో ఉన్న 217 నాటుసారా తయారీ ప్రాంతాలను 4 కేటగిరీలుగా గుర్తించి ప్రతీవారం సదరు ప్రాంతాలపై జిల్లాస్థాయిలో సిబ్బందిని సమీకరించి దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే జనవరి నెలల్లో 476 బైండోవర్ కేసులను నమోదు చేశామని, 62 మంది ముద్దాయిలను అరెస్టు చేసి 432 లీటర్ల సారా, 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిలో భాగంగా సోమవారం జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసినట్లు చెప్పారు. 42 మంది సిబ్బందితో 7 వాహనాలతో 7 బృందాలుగా ఏర్పడి  నిర్వహించిన దాడుల్లో 4200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని, అలాగే 110  లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా అయిదుగురు పాత నేరస్థులను అరెస్ట్ చేసి తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సయిజ్ సిఐ పాల నాగభూషణం, సిబ్బంది పాల్గొన్నారు,

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us