బాహుబ‌లికి 6 వేల ప్ర‌తిపాద‌న‌లు

Updated 4th May 2017 Thursaday 5:00 PM

బాహుబ‌లితో ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్లో స్టార్‌డ‌మ్ సంపాదించిన ప్ర‌భాస్ గురించి ఓ ఆస‌క్తి విష‌యం చెక్క‌ర్లు కొడుతోంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న స‌మ‌యంలోనూ ఈ సినిమా కోసం ఐదేళ్లు త్యాగం చేసిన ప్ర‌భాస్‌ చివ‌రికి త‌న పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడ‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఇందులో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ఈ ఐదేళ్ల‌లో ప్ర‌భాస్‌కు ఏకంగా ఆరు వేల పెళ్లి ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయ‌ట‌. బాహుబ‌లి కోసం సైన్ చేసిన‌పుడే ఈ ఐదేళ్లూ పెళ్లికి దూరంగా ఉండాల‌ని ప్ర‌భాస్ డిసైడ‌య్యాడు. దీంతో ఇన్ని వేల ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చినా అత‌ను మాత్రం దేనికీ ఓకే చెప్ప‌లేదు. ఇప్పుడు బాహుబ‌లి భారం తీరిపోవ‌డంతో ఈ ఏడాది ప్ర‌భాస్ పెళ్లి పీటలెక్కే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అత‌ని పెదనాన్నకృష్ణంరాజు కూడా ఈ విష‌యాన్ని ఇంత‌కుముందే చెప్పారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us