పెద్దాపురంలో భారీ చోరీ

UPDATED 14th SEPTEMBER 2017 THURSDAY 5:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక కొండయ్యపేట రెవిన్యూ కాలనీలో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే రంగాల మేరీకుమారి తన భర్త ఓం ప్రకాష్ మృతి చెందడంతో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఇది గమనించిన దుండగులు గురువారం తెల్లవారుజామున ఆమె ఇంట్లోకి చొరబడి రూ. రెండు లక్షలు నగదు, 25 కాసుల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. బాధితురాలు ఇంటి వరండాలో నిద్రిస్తుండగా దుండగులు ఇంట్లోకి చొరబడి ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పట్టణ  సిఐ ఎస్. ప్రసన్నవీరయ్య గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అలాగే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రప్పించి వివరాలను సేకరించారు. బాధితురాలి  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.     

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us