సమష్టి కృషితో డీసీసీబీ ప్రగతి

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 3 నవంబర్ 2021: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వ్యాపారాభివృద్ధికి ఉద్యోగులంతా కృషి చేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని డీసీసీబీ ఛైర్మన్‌ ఆకుల వీర్రాజు సూచించారు. కాకినాడలోని ఆ బ్యాంకు కార్యాలయంలో డీఎల్‌ఎంఆర్‌సీ, డీఎల్‌ఈసీ సమావేశాలను బుధవారం నిర్వహించారు. డీసీసీబీ అనుబంధ సొసైటీల్లోని హెచ్‌ఆర్‌ పాలసీ అమలు, సిబ్బంది క్రమబద్ధీకరణ, ఇతర సమస్యలపై చర్చించారు. జిల్లా సహకార అధికారి బీకే దుర్గాప్రసాద్‌, సీఈవో బి.హెచ్‌.సత్యప్రసాద్‌, ఆప్కాబ్‌ ఏజీఎం సురేంద్ర, డీసీసీబీ జీఎం ప్రవీణ్‌కుమార్‌, డీజీఎం శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన డీఎల్‌ఎంఆర్‌సీ సమావేశంలో బ్యాంకు వ్యాపారాభివృద్ధికి, చర్యలు, మొండి బకాయిల వసూళ్లకు తీసుకోవాల్సిన చర్యలను ఛైర్మన్‌ సూచించారు. తాను బాధ్యతలు తీసుకున్న తరువాత పాలకవర్గ సభ్యుల సహకారంతో రూ.75 కోట్ల మేర బకాయిలు వసూలు చేశామన్నారు. నాబార్డ్‌ డీడీఎం సోమినాయుడు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us