కాకినాడ-వేమగిరి కెనాల్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి

UPDATED 27th JANUARY 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: కాకినాడ-వేమగిరి కెనాల్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి  దువ్వా శేషుబాబ్జీ అన్నారు. పార్టీ పట్టణ కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో పట్టణ కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా   దువ్వా శేషుబాబ్జీ హాజరై మాట్లాడుతూ కాకినాడ నుంచి వేమగిరి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా ఉందని, ఈ రహదారి నిమిత్తం మాజీ ఎమ్మెల్సీ జార్జి విక్టర్ శాసన మండలిలో చర్చించి నిధులు విడుదల చేయించారని అన్నారు. రోడ్లు వెడల్పు చేయడానికి ఇళ్ళు ఖాళీ చేయించారని, ప్రస్తుతం రోడ్డు పనులు నిలిపివేయడంతో ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నిధులు వెనక్కి వెళ్లిపోయానని విమర్శించారు.  అసంపూర్తిగా ఉన్న ఈ రోడ్డుతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప ఈ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టేలా బాధ్యత వహించాలని అన్నారు. అలాగే సామర్లకోట పెద్దాపురం రోడ్డు వెడల్పులో ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం నుంచి మఠం సెంటర్ వరకు విస్తరించి, మఠం సెంటర్ నుంచి స్టేషన్ సెంటర్ వరకు ఎందుకు విస్తరించలేదని, ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి ఇలా చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖా కార్యదర్శులు తుంపాల శ్రీనివాస్, బాలం శ్రీనివాస్, నాయకులు కరణం గోవిందరాజు, నమ్మి వీరభద్రరావు, కరణం శ్రీనివాస్, బాలాజీ, కరణం సత్యనారాయణ, మాణిక్యం యువరాజు, కోన శివ, గోపాల్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us