మున్సిపల్ పాఠశాలల అభివృద్ధికి కృషి

UPDATED 19th JULY 2018 THURSDAY 6:00 PM

సామర్లకోట: పట్టణంలో మున్సిపల్ పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని అందులో భాగంగానే స్థానిక మసీదు వీధిలో ఉన్న స్పెషల్ మున్సిపల్  ప్రాథమిక పాఠశాలను రూ. 40 లక్షలతో పునర్నిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సామర్లకోట పట్టణంలోని మూడు, నాలుగు వార్డుల్లో గల ప్రజా సమస్యలపై నిర్వహించిన పాదయాత్రలో మంత్రి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ పట్టణంలో గల అన్నివార్డుల్లో ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టామని, డ్రైనేజి, త్రాగునీరు, తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. అర్హత కలిగిన వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని, పింఛన్ల మంజూరుకు పేదవారు, వయస్సును ప్రామాణికంగాను, వికలాంగుల పింఛన్లలో అంగవైకల్య శాతాన్ని నిర్ధారించే సర్టిఫికెట్ ఆధారంగా మంజూరు అవుతాయని తెలిపారు. ప్రతి వార్డులో పూర్తిస్థాయిలో సిసి రోడ్లు నిర్మించడం జరిగిందని, అర్హత గల వారికి తెల్ల రేషన్ కార్డులను అందచేశామని తెలిపారు. అన్ని వర్గాల వారికి అవసరమైన మేరకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నామని, అందులో భాగంగానే నాయీ బ్రాహ్మణ కమ్యూనిటీ భవనానికి రూ. 4.50 లక్షల చెక్కును అందచేశారు. అలాగే నూరని-జమియా మసీదు అభివృద్ధికి రూ. ఐదు లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మసీదు వీధిలో గల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారులకు అందిస్తున్న పోషకాహారంపై అంగన్వాడీ కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, అసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌన్సిలర్ పి. హేమలత, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, బడుగు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us