వామ్మో ఎంత పెద్ద వంతెనో....

UPDATED 15TH MAY 2017 MONDAY 5:00 PM

REDBEENEWS: చైనా సరిహద్దులో భారత్‌లో అతిపెద్ద వంతెనను ఈనెల 26న ప్రారంభించనున్నారు. 60 టన్నుల యుద్ధ ట్యాంకు బరువును సైతం తట్టుకోగలిగే సామర్ధ్యం ఈ వంతెనకు ఉంది. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలను కలుపుతూ బ్రహ్మపుత్ర నదిపై ఈ వంతెనను నిర్మించారు. ధోలా నుంచి సదియా మధ్య 9.15 కిలోమీటర్ల దూరాన్ని ఇది కలుపుతోంది. ఇప్పటి వరకు భారత్‌లోనే పొడవైన వంతెనగా ముంబయిలోని బంద్రా-వ్రోలి మధ్య ఉన్న 3.55కి.మీ వంతెన ఉంది. కాగా అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రజల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ఈ వంతెన దోహదపడుతోంది. అత్యవసర సమయాల్లో ఇరు ప్రాంతాలకు చెందిన ఆర్మీ సిబ్బంది వచ్చేందుకు ఈ వంతెన పై ప్రయాణం సులభంగా ఉంటుంది. 2011లో రూ.950కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం ఈ ఏడాది ముగిసింది. అసోం రాజధాని దిస్పూర్‌కు 540కి.మీ దూరంలో.. అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు 300కి.మీ దూరంలో ఈ వంతెన ఉంది. చైనా సరిహద్దుకు ఇది కేవలం 100కి.మీ దూరంలో ఉంది. తద్వారా ఇరు ప్రాంతాల మధ్య పట్టే ప్రయాణ సమయం నాలుగు గంటల వరకు ఆదా అవుతుంది. ధోలా, సదియా మధ్య నిర్మించిన బ్రిడ్జి ని ఈ నెల 26  న  ప్రధాని మోడీ ప్రారంభిస్తారని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ పేర్కొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us