సామాజిక న్యాయంతోనే సమాజాభివృద్ధి

Updated 22nd April 2017 Saturday 2:15 PM

పెద్దాపురం: అన్ని వర్గాలకు సమాన న్యాయం ద్వారానే భారత దేశంలో సామాజికాభివృద్ధి సాధ్య పడుతుందని ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్ వర్క్ ( ఏ ఐ పి ఎస్ ఎన్) జాతీయ ప్రధాన కార్యదర్శి టి. రమేష్ అన్నారు. స్థానిక వరహాలయ్యపేట లోని యాసలపు సూర్యారావు భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. సిమెంట్ రోడ్లు, భవనాలు, నగరాలు నిర్మించడం అభివృద్ధి కాదని, ప్రజలందరికీ తిండి, బట్ట, గృహాలు నిర్మించడమే అభివృద్ధి అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మానవాభివృద్ధి  సూచికలో మనదేశం 120  వ స్ఠానం దిగువలో ఉందన్నారు. ఆర్ధికాభివృద్ధే దేశాభివృద్ధంటూ కార్పొరేట్ శక్తులు, పాలకులు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ప్రజలలో మూఢనమ్మకాలను పెంచుతూ సమాజాన్ని వెనక్కి తీసుకువెళ్లే శక్తులు పుట్టుకొస్తున్నాయన్నారు. ఈ తరుణంలో శాస్త్రీయ భావాలు ఆలోచనలు పెంపొందించి ఉత్తమ సమాజాన్ని నిర్మించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నిజమైన అభివృద్ధిని ప్రజలకు వివరించి సైన్స్ ఫలాలు ప్రజలందరికీ దక్కేందుకు దేశవ్యాప్తంగా 38  సంస్థలు కలిసి చేస్తున్న కృషి లో విద్యావంతులు, విద్యార్థులు, ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి  జిల్లా అధ్యక్షుడు కేదారి నాగు, మండలాధ్యక్షుడు మంతెన సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us