పెద్దాపురం నవోదయలో కొట్లాట

* జూనియర్ విద్యార్థులపై సీనియర్లు దాడి 
* 14 మంది విద్యార్థులు సస్పెండ్ 
UPDATED 16th JULY 2018 MONDAY 9:00 PM
పెద్దాపురం: జూనియర్ విద్యార్థులపై సీనియర్లు దాడి చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో గల జవహర్ నవోదయ విద్యాలయంలో సోమవారం చోటు చేసుకుంది. మంచి క్రమశిక్షణ, అత్యుత్తమ బోధనకు మారుపేరైన జవహర్ నవోదయా విద్యాలయలో నగదు విషయమై కాలేజీ, స్కూల్ విద్యార్థుల మధ్య తలెత్తిన స్వల్ప వివాదం కొట్లాటకు దారితీయడంతో 14 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. విషయం తీసుకున్న వెంటనే గాయపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు భాద్యులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. విద్యార్థులు మైనర్లు కావడంతో సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు భాద్యులైన 14 మంది విద్యార్థులను అయిదు రోజుల పాటు సస్పెండ్‌ చేసినట్లు వైస్‌ ప్రిన్సిపాల్ వెంకట రమణ తెలిపారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us