పేదలందరికీ గృహాలు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం

UPDATED 9th FEBRUARY 2019 SATURDAY 6:00 PM

పెద్దాపురం: రాష్ట్రంలో పేదలందరికీ 2020 సంవత్సరం నాటికి గృహాలు నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం మండలం వాలు తిమ్మాపురం రహదారిలో అందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా నూతనంగా నిర్మించిన 1724 గృహాలను  ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిధిగా మంత్రి చినరాజప్ప పాల్గొని మాట్లాడారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ ఇళ్ళు నిర్మాణం చేపట్టడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల గృహాలను ఈరోజు ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో రూ.434.36 కోట్లతో నిర్మించిన 39,169 గృహాలను ప్రారంభిస్తున్నామని, నియోజకవర్గ పరిధిలో గ్రామీణ ప్రాంత పరిధిలో అందరికీ ఇళ్ళు పధకం క్రింద రూ.28.69 కోట్లతో నిర్మించిన 2279 గృహాలు, పెద్దాపురం పట్టణంలో రూ.108.28 కోట్లతో పిఎంఎవై-ఎన్టీఆర్ నగర్ (అర్బన్) అందరికీ ఇళ్ళు పథకం కింద నిర్మించిన 1724 ఇళ్లను  ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నాణ్యమైన అపార్ట్ మెంట్లు నిర్మించి వాటిలో త్రాగునీరు, కరెంటు, రహదారులు, రేషన్ షాపు, మార్కెట్, అంగన్వాడీ కేంద్రం పాఠశాల ఏర్పాటు చేస్తామని, ఇదొక టౌన్ షిప్ లా ఉంటుందని అన్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు నిర్మిస్తున్న గృహాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం జరిగిందని తెలిపారు. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ. పదివేలు చొప్పున పసుపు-కుంకుమ కింద ఆర్థిక సహాయం అందజేశామని, అలాగే 56 లక్షల మందికి పెంచిన పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఫేజ్-2 ద్వారా గృహాలు ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు మంత్రి లబ్ధిదారుల గృహాలను ప్రారంభించి, శిలాఫలకం, పైలాన్ లను ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలు, ఆర్.పిలకు ట్యాబ్ లు మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, హౌసింగ్ పిడి జివి ప్రసాద్, ఇఇ బి. సుధాకర్ పట్నాయక్, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, త్సలికి సత్య భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us