TS News: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన 17న తెరాస విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021‌: కేంద్ర ప్రభుత్వం, భాజపాపై ముప్పేట దాడికి పార్టీ యంత్రాగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని తెరాస భావిస్తోంది. ధాన్యం కొనుగోళ్లు, సింగరేణి గనుల ప్రైవేటీకరణ వంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళిక చేస్తోంది. దళితబంధు పథకం ఆగిపోయినట్లేనన్న ప్రచారాన్ని కూడా తిప్పికొట్టేలా ప్రణాళిక చేస్తోంది. కేంద్రంపై పోరులో భవిష్యత్తు కార్యచరణపై పార్టీ శ్రేణులకు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లుండి దిశా నిర్దేశం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం 17న జరగనుంది. తెలంగాణ భవన్‌లో ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరగనుంది. తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని సమావేశానికి ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వంపై పోరు, దళితబంధు, ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ప్రధాన అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సమావేశమైన మరుసటి రోజునే మంత్రులు, కలెక్టర్లతో సీఎం భేటీ కానున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us