UPDATED 12th APRIL 2022 TUESDAY 12:20 PM
Acharya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ను ఇవాళ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇవాళ సాయంత్రం 5.09 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 152 థియేటర్లలో నేరుగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఆచార్య సినిమా కోసం ప్రేక్షకులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసేందుకు చిత్ర యూనిట్ ఇవాళ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తోంది.కాగా ఈ ట్రైలర్ నిడివికి సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆచార్య థియేట్రికల్ ట్రైలర్ రన్‌టైమ్ 2 నిమిషాల 35 సెకన్లుగా చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ థియేట్రికల్ ట్రైలర్‌ను నేరుగా 152 థియేటర్లలో సాయంత్రం 5.09 గంటలకు రిలీజ్ చేస్తుండగా, ఆన్లైన్లో మాత్రం రాత్రి 7.02 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ట్రైలర్ కట్ చాలా బాగా వచ్చిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. చాలా రోజుల తరువాత మెగాస్టార్ నుండి పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూడబోతున్నట్లు ఆచార్య టీమ్ అంటోంది.
ఇక ఈ సినిమాలో చిరు ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరు-చరణ్‌ల మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.
కాగా ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, చరణ్ సరసన స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్గా కనిపిస్తుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.