బడిఈడు పిల్లల ప్రవేశానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి

UPDATED 27th APRIL 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: బడిఈడు పిల్లలందరూ మున్సిపల్ పాఠశాలల్లో చేరేలా ఉపాధ్యాయులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మున్సిపల్ కమీషనర్ చోడగం వెంకటేశ్వరరావు అన్నారు. మున్సిపల్ పరిధిలోని 13 ప్రాథమిక పాఠశాలలు, నాలుగు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రోజువారీ అడ్మిషన్లపై శుక్రవారం మధ్యాహ్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ పాఠశాలల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, పేద, దిగువ మధ్యతరగతి పిల్లలు చదివే మున్సిపల్ పాఠశాలలో బెంచీలు, తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా బడిఈడు పిల్లలందరూ మున్సిపల్ పాఠశాలల్లో చేరేలా ఉపాధ్యాయులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. ఈ నెల 30వ తేదీలోగా బడిఈడు పిల్లలందరూ నమోదయ్యేలా విస్తృతంగా కృషి చేయాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన విద్యా బోధనపై ప్రచారం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎంలు తోటకూర సాయి రామకృష్ణ, యు. సత్యన్నారాయణ, టి.శ్యామ్ సుందర్, ఆర్..శ్రీనివాస రాజు, కె.ఎస్. శేఖరం, మునిసిపల్ మేనేజర్ జయకర్, సీనియర్ అసిస్టెంట్ సుజాత, మెప్మా సిబ్బంది సుధాకర్, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us