ఘనంగా పోలేరమ్మ జాతర మహోత్సవాలు

UPDATED 15th MAY 2018 TUESDAY 7:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జాతర సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేకువజామునుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర మహోత్సవాల్లో భాగంగా పెద్దపులి ఆటలు, గరగల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు, కళ్లుమిరుమిట్లు గొలిపే బాణాసంచా మొదలయిన ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us