పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు

UPDATED 17th APRIL 2018 TUESDAY 5:00 PM

పెద్దాపురం: ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి తన వంతు కృషి చేస్తున్నానని రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలోని 19వ వార్డు సుబ్బయ్యమ్మపేటలో రూ.4.75 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును మంత్రి మంగళవారం ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు వేసవిని దృష్టిలో పెట్టుకుని త్రాగునీటికి సమస్య లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ రోజు వాటర్ ట్యాంకును ప్రాంభించడం జరిగిందని తెలిపారు. వేసవిలో భూగర్భ జలాలు తగ్గడం వల్ల నీటికి సమస్య ఏర్పడుతుందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పారు. ప్రజలందరి అవసరాలకి అనుగుణంగా కావలసిన సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,   పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చామని ప్రజలు మున్సిపాల్టీకి సహకరించి రోడ్ల మీద చెత్తను వేయకుండా కేటాయించిన చెత్తకుండీలోనే వేయాలన్నారు. ప్రతి ఇంటి వద్ద మొక్కలను పెంచి తద్వారా అధిక వేడిని, కాలుష్యాన్ని నివారించగలమని చెప్పారు. ప్రతి వార్డుల్లోను సి.సి రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు త్రాగునీటికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చోట మున్సిపల్ ట్యాంకులు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోరుపూరి రాజు,  టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతికరాజు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, వార్డు కౌన్సిలర్ చల్లా సూర్యకుమారి, మున్సిపల్ డిఇఇ రమేష్, ఎఇ సుధాకర్, టిపివో భాస్కరరావు, శానిటేషన్ ఇనస్పెక్టర్ డేవిడ్ రాజు, జె.ఇ లోవరాజు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us