క్రీడాకారులు నైపుణ్యం పెంపొందించుకోవాలి

UPDATED 31st MAY 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: క్రీడాకారులు శిక్షణలో ఇచ్చిన మెళకువలను పాటించి నైపుణ్యం పెంపొందించుకోవాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు భోగిళ్ళ మురళీ కుమార్ అన్నారు. స్థానిక బచ్చుఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్పోర్ట్స్ ఆథారిటీ సౌజన్యంతో నెల రోజులు పాటు నిర్వహించిన కబడ్డీ, ఖోఖో వేసవి శిక్షణా శిబిరాలు గురువారంతో ముగిసాయి. ఈ శిబిరంలో కబడ్డీ, ఖోఖో కన్వీనర్లుగా తాళ్లూరి వైకుంఠం, ఇ. వీరబాబు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ, యు. సత్య నారాయణ, జిల్లా కబడ్డీ కోచ్ సాయిప్రసాద్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొండపల్లి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us