AP News: స్టూడెంట్ లీడర్ అనుభవంతోనే రాజకీయాల్లో ఎదిగా: చంద్రబాబు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022: నేటి యువత, నిపుణులు రాజకీయాల్లోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. టీడీపీలో ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన 28 మంది విద్యార్థులు, నిపుణులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు. రెండు నెలల పాటు పార్టీ 55 లోని వివిధ విభాగాల్లో, వివిధ అంశాలపై చేసిన పరిశోధనను నివేదిక రూపంలో అందించారు. ఇంటర్న్ షిప్ చేసిన 28 మందికి ధ్రువీకరణ పత్రాలను చంద్రబాబు అందించారు. ఈ సందర్భంగా వారితో కొద్ది సేపుIముచ్చటించారు. “ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల పట్ల యువత ఆసక్తివ్చూపడం లేదు. విద్యార్థులు సైతం రాజకీయాలను, నాయం పరిశీలించాలి. ప్రజా విధానాలు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయి. నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం O. యూనివర్సిటీ స్థాయిలో స్టూడెంట్లీడర్ గా పనిచేసిన అనుభవంతోనే రాజకీయాల్లో ఎదిగాను. నేటి రాజకీయాలను, నేతలను చూసి యువత 'మా ఈకర్మ' అని అనుకుంటున్నారు. విద్యార్ధులు, యువత ఒక గమ్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us