దూసుకొచ్చిన మృత్యువు

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

గండేపల్లి (రెడ్ బీ న్యూస్) 17 : ‌శుభకార్యానికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా కారు ఢీని భర్త మృతి చెందగా, భార్యకు గాయాలయ్యాయి. గండేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురం మండలం మంగితుర్తి గ్రామం బుచ్చి తిమ్మరాజుపేటకు చెందిన పోలవరపు రాంబాబు(48) భార్య మంగతో కలిసి బుధవారం రాజానగరం మండలం దొసకాయలపల్లి శుభకార్యానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి కళాశాల దాటిన తర్వాత వారిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. రాంబాబు వాహనంతో సహా పక్కనే ఉన్న గుంతలో పడిపోయారు. వెంటనే ఆయనపై కారు బోల్తాపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య మంగకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న కల్వచర్లకు చెందిన భార్యభర్తలకు స్వల్పగాయాలయ్యాయి.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us