ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యం

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 16 నవంబర్ 2021: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం.. వారికి వసతులు అందించేందుకు కృషి చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌మాల్యా పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం మంగళవారం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ను పరిశీలింంచారు. జీఎం మాట్లాడుతూ, విజయవాడ నుంచి కాకినాడ వరకు రైల్వేస్టేషన్లలో అందిస్తున్న సేవలు, ట్రాక్‌ల పనితీరు చూస్తున్నామన్నారు. రైల్వే సిబ్బంది నివాస సముదాయాల్లో సౌకర్యాలను పెంచి..రైల్వే ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తామన్నారు. తర్వాత రాజమహేంద్రవరం రైల్వే రక్షక దళ మహిళా బ్యారక్‌ను ప్రారంభించారు.ఆపై దృశ్య మాధ్యమం నుంచి సామర్లకోట రైల్వేస్టేషన్‌లోని నూతన ఆర్పీఎఫ్‌ అవుట్‌పోస్టు, కాకినాడ రైల్వేస్టేషను పరిధి సర్పవరంలో నిర్మించిన 10 కేవీ సోలార్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. పీసీసీఎం జాన్‌ప్రసాద్‌, పీసీవోఎం ధనంజయులు, ఉన్నతాధికారులు, విజయవాడ డివిజన్‌ అధికారులు పాల్గొన్నారు. తర్వాత ద్వారపూడిలో గూడ్సు షెడ్‌ పరిశీలన, అనపర్తి-సామర్లకోట రైల్వేట్రాక్‌ వేగ పరీక్ష నిర్వహించి కాకినాడ చేరుకున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us