రోడ్డుపై గుట్టలుగా రూ.2 వేల నోట్ల కట్టలు

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 12 జనవరి 2022 : మాదాపూర్ లో నకిలీ కరెన్సీ కలకలం సృష్టించింది. 100 ఫీట్ రోడ్ కు సమీపంలోని కాకతీయ రోడ్డులో గుట్టలు గుట్టలుగా రూ.2000 నోట్లు దర్శనమిచ్చాయి. దీంతో స్థానికులు, వాహనదారులు వాటి కోసం ఎగబడ్డారు. అందినకాడికి తీసుకుని వెళ్లిపోయారు. అయితే ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండటంతో వాటిని తీసుకున్న వారంతా నిరాశ చెందారు. కరెన్సీ నోట్ల కోసం జనం ఎగబడటంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ జాం అయింది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us