రెండు బైకులు ఢీ.. ఇద్దరు మహిళలు మృతి

UPDATED 3rd MAY 2017 SATURDAY 11:00 AM

పెద్దాపురం: రెండు మోటార్ బైక్ లు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన పెద్దాపురం పట్టణంలో శనివారం ఉదయం జరిగింది. పెద్దాపురం ఎస్ ఐ ఎ. కృష్ణభగవాన్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దాపురం పట్టణం పద్మనాభా కాలనీకి చెందిన అక్కా చెల్లెళ్ళు పైలా లక్ష్మి (25) ఆమె భర్త శ్రీనివాస్, మరదలు జల్పా తరుణకుమారి (20) సామర్లకోట పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తున్నారు.ఉదయాన్నే స్కూల్ కి మోటారు సైకిల్ పై వెళుతుండగా సరిగ్గా లూధరన్ హై స్కూల్ కి వచ్చేసరికి ఎదురుగా మోటార్ బైక్ పై వస్తున్న మురారి చెందిన  యువకులు బైక్ పై వేగంగా వచ్చి వీరిని బలంగా ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అక్కడ అక్కా చెల్లెళ్ళు మృతి చెందారు. అలాగే ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us