పెదబ్రహ్మదేవంలో అశ్లీల నృత్యాలు

UPDATED 14th FEBRUARY 2018 WEDNESDAY 10:30 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద బహిరంగంగా యువతులతో అశ్లీల నృత్యాలు నిర్వహించారు. డాన్సులు చూసేందుకు సమీప గ్రామాల్లోని యువకులు, ప్రజలు ఎగబడ్డారు. మరోవైపు డాన్సులను మొబైల్లో చిత్రీకరిస్తున్న వారిపై నిర్వాహకులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రికి పోలీసుల బందోబస్తు ఎక్కువగా ఉంటుందని గ్రహించిన నిర్వాహకులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని సమాచారం. భక్తి ముసుగులో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us