అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ను సీఎం ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ స్టార్ షట్లర్‌కు ప్రభుత్వం తరఫున రూ.7లక్షల నగదు బహుమతి అందజేశారు. దీంతో పాటు తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. కాగా, శ్రీకాంత్ ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.