నూకాలమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

Updated 9th April 2017 Sunday 2:30PM
పెద్దాపురం: కోరిన వరాలిచ్చే చల్లని తల్లి భక్తుల పాలిట కొంగు బంగారం కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రెండో ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్య లో భక్తులు బారులు తీరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజామునే అమ్మవారిని దర్శించుకొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ చైర్మన్ ఎలిశెట్టి నాగలక్ష్మీనాని, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వివి పల్లంరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే భక్తులకు నాని యూత్ ఆధ్వర్యం లో మంచినీరు, మజ్జిగను సరఫరా చేశారు. అలాగే చంటిపిల్లలకు పాలు సరఫరా చేశారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో రహదారులు భక్తుల వాహనాలతో రద్దీగా మారాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ ఎస్. రాజశేఖర్ రావు, సిఐ ఎస్. ప్రసన్నవీరయ్యగౌడ్ పర్యవేక్షణలో ఎస్ ఐ  వై. సతీష్ బందోబస్త్ నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ  వాహనాలను  పార్కింగ్ చేసుకునేందుకు ప్రత్యేకం గా స్థలాన్ని ఏర్పాటుచేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను  స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, సర్పంచ్ కుంచే గాంధీ, ఉప సర్పంచ్ ఎలిశెట్టి చక్రప్రకాష్, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.     

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us