మేము అధికారంలోకి వచ్చాక ఉచితంగా పట్టాలిస్తాం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల హక్కులను కాలరాస్తూ... వాటికి ఆర్థిక సంఘాలు ఇచ్చిన నిధులను లాక్కోవడం దుర్మార్గమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును కేంద్రం తప్పుబట్టడం, పంచాయతీలు సొంతంగా ఖాతాలు తెరుచుకుంటేనే నిధులిస్తామని చెప్పడంతో ముఖ్యమంత్రి జగన్‌ను చెంపదెబ్బ కొట్టినట్లయిందన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పులు, దోపిడీలు, నిత్యావసర ధరల పెరుగుదలలో నెం.1 స్థానంలో ఉందని చెప్పారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురజాల నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన దాచేపల్లి, గురజాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. ఓటీఎస్‌ డబ్బులు ఎవరూ కట్టొద్దని, తెదేపా అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచితంగా పట్టాలిస్తామని చెప్పారు. ‘‘పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతుల్ని అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు... రైతులకు కనీసం వసతి కూడా లేకుండా చేశారు. వాళ్లు రోడ్లపై భోజనం చేయాల్సిన పరిస్థితి కల్పించారు. ఆడబిడ్డల్ని అవమానించినందుకు సిగ్గుగా లేదా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘2021 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి, మంత్రి ప్రగల్బాలు పలికారు. మరి పూర్తి చేశారా? పోలవరం ప్రారంభోత్సవానికి వెళదామా?’’ అని దుయ్యబట్టారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us