AP News: రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: చంద్రబాబు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. చేయని తప్పుకు సంక్రాంతి పండుగ రోజు రైతు నరేంద్ర జైలులో ఉండడానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. పండుగ పూట ఆ అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ప్రభుత్వాన్ని రైతులోకం క్షమించదన్నారు. మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి జగన్ ప్రభుత్వం రైతు వర్గాన్నే అవమానించిందని ఆక్షేపించారు. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయిందని.. తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ ఇప్పటికే సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని వెంటనే రైతు నరేంద్ర ను విడుదల చేయాలని.. వేధింపులకు గురిచేసినందుకు అతని కుటుంబానికి పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us