Ticket Rates: టికెట్ల ధరలపై కొత్త కమిటీ వేశాం

★ హైకోర్టుకు నివేదించిన ఏజీ

అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : సినిమా టికెట్ల ధరల విషయంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సినీ పరిశ్రమ, ప్రభుత్వ అధికారులతో కొత్త కమిటీని ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ హైకోర్టుకు నివేదించారు. డిసెంబరు 27న జీవో 144 జారీ చేశామని, కమిటీ డిసెంబరు 31న భేటీ అయిందని తెలిపారు. జనవరి 11న మరోసారి సమావేశం కానుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో సినిమా టికెట్ల ధరలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం అప్పీళ్లపై విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ గతేడాది ఏప్రిల్‌ 8న రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన జీవో 35ను సవాలు చేస్తూ పలు సినిమా థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. జీవో 35కు పూర్వం అనుసరించిన విధానాన్ని ధరల ఖరారు విషయంలో పాటించాలని ఆదేశించారు. ఆ ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీల్‌ వేసింది. ఇటీవల అప్పీళ్లపై విచారణ చేసిన ధర్మాసనం.. టికెట్ల ధరల ఖరారు కోసం కొత్త కమిటీని వేయాలని ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. సోమవారం అప్పీళ్లపై మరోసారి విచారణ జరిగింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us