రాష్ట్రంలో నెంబర్ వన్ గా పెద్దాపురం నియోజకవర్గం

* ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
* పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

UPDATED 19th OCTOBER 2018 FRIDAY 5:30 PM

పెద్దాపురం: పెద్దాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబరు వన్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పెద్దాపురం పట్టణంలో రూ.17 లక్షలతో నూతనంగా నిర్మించిన పట్టణ తాపీవర్కర్సు యూనియన్ కమ్యూనిటీ భవనం, మెప్మా స్వయం సహాయక సంఘ సభ్యులచే నడుపబడుచున్న రాజా టైలరింగ్   యూనిట్ ను ప్రారంభించి, రూ.10 లక్షలతో స్థానిక కొత్తపేటలో నిర్మించనున్న హనుమాన్ వ్యాయామశాలకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణ తాపీవర్కర్సు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టి అన్ని వర్గాల ప్రజల అవసరాలను తీరుస్తున్నామని, అలాగే రూ.250 కోట్లుతో రాజానగరం నుంచి సామర్లకోట వరకు రోడ్డును అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాపు, సూర్యబలిజ కులస్తులకు కళ్యాణ మండపాలు, అలాగే అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు, ప్రజల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, ఇదే సహకారం భవిష్యత్తులో అందిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు. సిసి రోడ్లు, డ్రైన్లు పూర్తిస్థాయిలో వచ్చే జనవరి నాటికి పూర్తవుతాయని అన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు రూ.600 కోట్లుతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, పట్టణంలో మంత్రి చొరవతో శతాబ్ది పార్కును ఏర్పాటు చేసుకున్నామని, అలాగే రెండు చెఱువులను పార్కులుగా సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తాపీవర్కర్ల యూనియన్ మంత్రి చినరాజప్ప, చైర్మన్ రాజా సూరిబాబురాజు, తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, బ్యాంకు మేనేజర్లు శివశంకర్, నందగోపాలకృష్ణ, టి.పి.ఆర్.వో శైలజ, వార్డు కౌన్సిలర్లు, రంధి సత్యనారాయణ, తాపీవర్కర్సు యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సన్నేడి సత్తిబాబు, ప్రెసిడెంట్ పెంటకోట సత్తిబాబు, వైస్ ప్రెసిడెంట్ జి. శివబాబు, సెక్రటరీ నీలంశెట్టి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us