రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు:వ్యవసాయ శాఖామంత్రి కన్నబాబు

కాకినాడ: 23 జూన్ 2020(రెడ్ బీ న్యూస్):నవరత్నాలు పథకంలో పేదలందరికి ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నేమాం గ్రామం వద్ద ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేసిన లేఅవుట్ ను మంత్రి కన్నబాబు, జేసీ(ఆర్) జి.లక్ష్మీశ, కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రెవెన్యూ సిబ్బందితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని, నవరత్నాలు పేదలందరికి ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం కాకినాడ రూరల్ నియోజక వర్గం నేమాం గ్రామంలో నిర్వహించే అవకాశం ఉన్నందున, దానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి పేదవానికి ఇళ్ల స్థలం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఏ ఒక్క లబ్ధిదారుడు తప్పిపోకుండా అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా అధికారులు చూడాలని ముఖ్యమంత్రి పదే పదే చెప్పడం జరిగిందని మంత్రి తెలిపారు. నేమాం గ్రామంలో సిద్ధం చేస్తున్న లేఅవుట్ లో సుమారుగా 4 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా లేఅవుట్ ను అన్ని సదుపాయాలతో సిద్ధం చేయడం జరిగిందన్నారు. తద్వారా ఇక్కడ పెద్ద టౌన్ షిప్పు తయారైయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సుమారుగా రూ.2500 కోట్ల రూపాయాల పైన వెచ్చించి ఇళ్ల స్థలాలు సిద్ధం చేయడం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి వెంట అడిషనల్ ఎస్.పి కరణం కుమార్, కాకినాడ ఆర్డివో చిన్నికృష్ణ, గుడా వీసీ డాక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, సెక్రటరీ జి.సన్యాసిరావు, కాకినాడ రూరల్ తాహశీల్దార్ వి.మురళీకృష్ణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us