Sajjala: సమ్మెతో ఉద్యోగులు ఏమి సాధిస్తారు:సజ్జల

UPDATED 3 FEBRUARY 2022 THURSDAY 07:30 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో పీఆర్సీ వివాదం ముదురుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనలు ఉధృతం చేశారు. తాజాగా పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తో ఉద్యోగులు ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.

పీఆర్సీని ఏ విధంగా రూపొందించారో ప్రభుత్వం వివరించిందని, ఉన్నంతలో మంచి ప్యాకేజీ ఇచ్చామని ఆయన తెలిపారు. ఉద్యోగులను రోజూ చర్చలకు పిలుస్తున్నా, స్పందన లేదని ఆరోపించారు. బల ప్రదర్శన చేయడం వల్ల సమస్య జటిలం అవుతుందని అన్నారు. ఇవాళ చేపట్టిన ప్రదర్శనతో, 6వ తేదీ అర్ధరాత్రి నుంచే పట్టే సమ్మెతో ఉద్యోగులు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదన్నారు సజ్జల.

గత ప్రభుత్వంలోని లేని ఉద్యోగ భద్రతను తాము కల్పించామని సజ్జల అన్నారు. కరోనా వ్యాప్తి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మారిందో అందరికీ తెలుసు అన్నారు. మరోపక్క సంక్షేమానికి కూడా నిధులు అవసరమైన పరిస్థితి తలెత్తిందన్నారు. కొవిడ్ కారణంగా ఏర్పడిన సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియదని, చర్చల సమయంలో ఉద్యోగులకు పరిస్థితి వివరించినా అర్థం చేసుకోలేదని సజ్జల విమర్శించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us