జె. తిమ్మాపురం కేసును చేధించిన పోలీసులు

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 16 నవంబర్ 2021: చోరీ కేసుల్లో తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెద్దాపురం మండలం జె.తిమ్మాపురంలో ఈ నెల 10న జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 1.34 వేల రూపాయల విలువైన వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. అయితే ఫిర్యాదుదారుడు రామన్న చౌదరి మాత్రం పోలీసులను తప్పుదోవ పట్టించడానికి 38 తులాల బంగారం, 16 కేజీల వెండి, రూ.3.40 లక్షల నగదు దొంగతనం జరిగిందని తప్పుడు ఫిర్యాదు చేశారని డీఎస్పీ తెలిపారు. రోల్డ్ గోల్డ్ వస్తువులను కూడా బంగారు ఆభరణాలుగా ఫిర్యాదులో పేర్కొన్నారని డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఫిర్యాదు చేసిన రామన్న చౌదరిపై ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులను పట్టుకుని చోరీ సొత్తు రికవరీకి కృషి చేసిన క్రైమ్ సీఐ సత్యనారాయణ, పెద్దాపురం సీఐ జయకుమార్, ఎస్ఐ మురళీమోహన్, క్రైమ్ సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us