Chiranjeevi: చిరంజీవికి కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన నటుడు

Updated 26 January 2022 Wednesday 09:40 AM

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): అగ్ర కథానాయకుడు, నటుడు మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బుధవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. "అన్ని రకాల జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. కాబట్టి గత కొన్ని రోజుల నుంచి నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. త్వరలోనే మీ అందరి ముందుకు పూర్తి ఆరోగ్యంతో తిరిగివస్తాను" అని చిరంజీవి తెలిపారు. ఆయన ట్వీట్ తో అభిమానులందరూ ఆందోళనకు గురవుతున్నారు. చిరు వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ వరుస ట్వీట్లు పెడుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us