ప్రగతిలో ఐవోటితో ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్ వర్క్ షాప్

UPDATED 9th JULY 2018 MONDAY 6:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇసిఇ విద్యార్థులకు ఐవోటితో ఎంబెడెడ్ సిస్టమ్స్ వర్క్ షాప్ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కు చెందిన ఎమ్. ఉమామహేశ్వరరావు, జె. శివనాగరాజు, డి. ఫయాజుద్దీన్, జి. చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ వారం రోజులపాటు నిర్వహించు ఈ వర్క్ షాప్ ఇసిఇ విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకుని తద్వారా నూతన ప్రాజెక్టులు తయారు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.రిసోర్సు పర్సన్స్ ఎం. ఉమామహేశ్వరరావు, జె. శివనాగరాజు, పి. ఫయాజుద్దీన్, జి.చంద్రశేఖర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ , 8051 ప్రోగ్రామింగ్, తదితర వాటి గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, ఇసిఇ విభాగాధిపతి డాక్టర్ కె. శివకుమార స్వామి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us