ప్రతీ గ్రామానికి వసతుల కల్పనే లక్ష్యం

UPDATED 5th APRIL 2019 FRIDAY 10:00 PM

పెద్దాపురం: ప్రతీ గ్రామానికి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతానని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం మండలం ఆర్.బి.పట్నం, ఆర్.బి. కొత్తూరు, ఆనూరు, కొండపల్లి గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి పార్టీ మానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ తమ పార్టీ గుర్తు గాజులు గుర్తుపై ఓటువేసి తనను ఎంఎల్ఏగా అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్ధించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నయ్యదొర మాట్లాడుతూ తమ పార్టీలో ప్రకటించిన అంశాలకు ఆకర్షితులై పలువురు జై భారత్ నేషనల్ పార్టీవైపు ఆకర్షితులు అవుతున్నారని అన్నారు. పెద్దాపురం నియోజక వర్గంలో తమ పార్టీ బలమైన శక్తిగా ఉందన్నారు. పెద్దాపురం నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసే పూచీ నాదీ అంటూ ఆయన చేసిన ప్రసంగం కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడంతో పాటు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. డాక్టర్ చిన్నయ్యదొర నిర్వహించిన రోడ్‌షోలు జనహోరుతో మార్మోగాయి. ఆయన ప్రసంగం వినేందుకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉప్పొంగిన ఉత్సాహంతో కదలివచ్చారు. పిడికిలి బిగించి గాజులు గుర్తుకే మన ఓటంటూ.. చిన్నయ్యదొర నినదించగా, ఆయనను అనుసరిస్తూ ప్రజలంతా మద్దతు తెలిపారు. నేను లోకల్ వ్యక్తిని. ఎల్లప్పుడు అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తా. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించాలని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us