ప్రణాళికతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

UPDATED 18th JUNE 2018 MONDAY 9:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) ప్రాంగణంలో గల గైట్ అటానమస్ కళాశాల, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గైట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నూతన విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం బిటెక్ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుని భవిష్యత్తుని బంగారుమయం చేసుకోవాలని, ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని సమర్ధవంతంగా తట్టుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే విద్యార్థులు నిరంతరం శ్రమించాలని అన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, కళాశాల చేసే కృషికి తల్లిదండ్రుల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు. ఈ సమావేశంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ డి.వి.రామ్మూర్తి, డాక్టర్ ఎస్.ఎస్.ఎన్. రాజు, డాక్టర్ శర్మ, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్. మూర్తి, లీలావతి, డాక్టర్ ఎస్. శ్రీ గౌరీరెడ్డి,  డీన్లు డాక్టర్ ఎం. వరప్రసాదరావు, డాక్టర్ టి. జయానంద కుమార్, డైరెక్టర్లు డాక్టర్ టి.వి. ప్రసాద్, డాక్టర్ పి.ఆర్.కె. రాజు, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us