RRR: ఆర్ఆర్ఆర్ విడుదల మార్చిలో లేనట్లే.. అసలు కారణం ఇదేనా!

REDBEENEWS

RRR: ఈ ఏడాది సంక్రాంతికి భారీ, క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని దేశవ్యాప్తంగా లక్షల కళ్ళు ఎదురుచూసినా.. కరోనా దెబ్బకి సినిమాను వాయిదా వేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. సినిమా వాయిదా సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తామని ప్రకటించకపోగా.. కేవలం సరైన సమయం చూసుకొని విడుదల చేస్తామని చెప్పారు.

అయితే.. ఆర్ఆర్ఆర్ టీం కొత్త విడుదల తేదీ ఇదే అంటూ రెండు డేట్స్ ప్రకటించారు. మార్చి 18 లేదా ఏప్రిల్ 28నే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేసేందుకు జక్కన్న అండ్ టీం ఫిక్స్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చిలో కరోనా పరిస్థితి చక్కబడుతుందా లేదా.. ఏప్రిల్ లోనే రిలీజ్ కు వెళ్తారా అంటూ అప్పటి నుండే ఎన్నో చర్చలు నడుస్తుండగా..

ఇప్పుడు మార్చిలో ఈ సినిమా లేనట్లే అనేలా ఓ క్లారిటీ వస్తుంది. దానికి బలమైన ఓ కారణం కూడా ఉంది.కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ మధ్యనే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్ మార్చి 17న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా.. జేమ్స్ విడుదల తర్వాత వారం రోజుల పాటు రాష్ట్రంలో మరే సినిమా విడుదల చేయకూడదని.. పునీత్ కి నివాళిగా అక్కడి డిస్టిబ్యూటర్స్ నిర్ణయించుకున్నారు. అంటే.. ఆర్ఆర్ఆర్ మార్చి 18న విడుదల చేసినా కన్నడలో విడుదల కాలేదు. పైగా పునీత్ తో ఎన్టీఆర్-రామ్ చరణ్ లకు మంచి అనుబంధం కూడా ఉంది. దీనిని బట్టి చూస్తే ఆర్ఆర్ఆర్ మార్చిలో విడుదల చేయడం కష్టమే!

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us