కోళ్ళ ఫారాలపై న్యాయ శాఖ కన్ను

Updated 5th May 2017 Friday 2:00 PM

న్యూఢిల్లీ : కోళ్ళ ఫారాల్లో కోళ్ళను పెంచుతున్న తీరు, వాటిని రవాణా చేస్తున్న పద్ధతులపై కేంద్ర న్యాయ శాఖ దృష్టి సారించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం అంతర్జాతీయ ధోరణులను పరిగణనలోకి తీసుకుని నివేదిక సమర్పించాలని న్యాయ పరిశీలన సంఘం (లా కమిషన్)ను కోరింది. జంతు హక్కుల ఉద్యమకారిణి, కేంద్ర మంత్రి మేనక గాంధీ విజ్ఞప్తి మేరకు న్యాయ శాఖ ఈ చర్య తీసుకుంది. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ళ పెంపకానికి సంబంధించిన చట్టాలను పునః పరిశీలించాలని మేనక గాంధీ న్యాయ శాఖను కోరారు. న్యాయ శాఖ ఆదేశాల మేరకు లా కమిషన్ స్పందించింది. ఈ అంశంతో సంబంధం ఉన్న పక్షాలన్నీ తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. వివిధ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ మూగ జీవులను అనారోగ్యకర పరిస్థితుల్లో పెంచుతున్నారని మేనక తెలిపారని, ఆమె విజ్ఞప్తి మేరకు తమకు న్యాయ శాఖ నోటీసును పంపిందని లా కమిషన్ పేర్కొంది. పౌల్ట్రీ కోళ్ళకు అమ్మకాలు, నిర్వహణ, పెంపకం వంటి సమస్యలపై పౌల్ట్రీ ఫారాల నిర్వాహకులు, రవాణాదారులు, హోటల్ వ్యాపారులు, ఎన్‌జీవోలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. సలహాలు, అభిప్రాయాలను 30 రోజుల్లోగా లా కమిషన్ కార్యాలయానికి పంపించాలని తెలిపింది.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us